Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

570వ రోజుకు అమరావతి ఉద్యమం

570వ రోజుకు అమరావతి ఉద్యమం
, శుక్రవారం, 9 జులై 2021 (11:04 IST)
ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారం 570వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... మూడు రాజధానులతో ప్రయోజనం లేదని తెలిసినా, రాజకీయ కక్షతోనే ఆ ప్రతిపాదన తెచ్చారన్నారు.

రైతులు  భూములు స్వచ్ఛందంగా ఇస్తే,  కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులు లాక్కున్నారని ప్రచారం చేయటం వెనక కూడా కుట్ర దాగుందన్నారు. రూ.పది వేల కోట్లతో  అమరావతిలో పనులు జరిగితే అసలు ఏమీ జరగలేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. 

అమరావతి అభివృద్ధి ఆగిపోవటంతో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు  ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతిని తరలించటానికి ప్రభుత్వం రోజుకో కొత్త నాటకానికి తెరతీస్తుందన్నారు. అమరావతి కోసం రైతులకు మద్దతుగా దీక్ష చేస్తానని ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌ ఎందుకు దీక్షలు చేపట్టలేదు, ఎందుకు ప్రశ్నించటం లేదని దుయ్యబట్టారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ జరగాలని పేర్కొన్నారు. అమరావతి శ్మశానం కాదని రాష్ట్రాభివృద్దికి నిదర్శనమని అన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనకకు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 నుంచి హనుమ జన్మక్షేత్రంపై వెబినార్‌