Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విజయవాడ నుండి వైజాగ్ వరకు 555 కిలోమీటర్ల నడక, జెండా ఊపి నడకను ప్రారంభించిన గంధం చంద్రుడు

Advertiesment
విజయవాడ నుండి వైజాగ్ వరకు 555 కిలోమీటర్ల నడక, జెండా ఊపి నడకను ప్రారంభించిన గంధం చంద్రుడు
, సోమవారం, 18 నవంబరు 2019 (16:28 IST)
వారంతా వివిధ స్వచ్చంద సంస్థలు ప్రతినిధులు... ఎవరికి వారుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పుడు వారంతా ఒక బృందంగా ఏర్పడ్డారు. విభిన్న అంశాలలో విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు 555 కిలోమీటర్ల నడకకు శ్రీకారం చుట్టారు. 5 ఎ.ఎమ్ క్లబ్ నిర్వహణలో రోటరీ ఇంటర్నేషనల్, వైజాగ్ కపుల్స్, యంగ్ ఇండియన్స్, బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్, విజయవాడ రౌండ్ టేబుల్ 68, విజయవాడ లేడీస్ సర్కిల్ 52 వంటి స్వచ్ఛంద సంస్థల నుండి యాభై ఐదు మంది ఔత్సాహికులను ఇందుకోసం ఎంపిక చేశారు. 
 
విజయవాడలోని అమరావతి ఫంక్షన్ హాలు నుంచి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ 5 ఎఎమ్ నడక ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూలు కులాల సహకార ఆర్ధిక సంస్ధ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గంధం చంద్రుడు కార్యక్రమాన్ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో వారిలో “సేప్ అండ్ అన్ సేఫ్ టచ్”  అనే అంశంపై అవగాహన కల్పించేందుకు క్లబ్ సభ్యులు చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు.
 
ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తెరిగి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 5ఎ.ఎమ్ క్లబ్ వ్యవస్ధాపకులు కె.వి.టి. రమేష్ మాట్లాడుతూ విజయవాడ నుండి విశాఖపట్నం వరకు చేపట్టిన ఈ నడక గుడివాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, దిండి, రాజమండ్రి, అమలాపురం మీదుగా విశాఖపట్నం వరకు కొనసాగుతుందని తెలిపారు. మార్గమధ్యంలో దారి పొడవునా నడక కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల విద్యార్థులను కలుసుకొని వారిలో శారీరక, మానసిక ధృడత్వం అవశ్యకతను గురించి వివరిస్తామన్నారు.
 
సమాజంలో పెచ్చురిల్లుతున్న లైంగిక దాడుల నేపధ్యంలో వారికి ఇతరుల నుండి ఎదురయ్యే వివిధ రకాల స్పర్శల గురించి అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తామన్నారు. ఆరు రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగుతుందని, దాదాపు 450 పాఠశాలల్లో 50 వేల మంది పిల్లలను కలిసి వారిని చైతన్య వంతులను చేస్తామన్నారు. ఒక మంచి కార్యక్రమం కోసమే తామంతా ఇలా పాదయాత్ర చేపట్టడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ యువజన సంయిక్త కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు అడారి కిషోర్ కుమార్ తెలిపారు.
webdunia
తమ వల్ల సమాజంలో ఎంతో కొంత మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  ఆర్ సివిసి అధ్యక్షురాలు రాధిక సతీష్, అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ అన్వేష్ వర్ణ, సీనియర్ జర్నలిస్టు బొప్పన రవికుమార్, బిఎన్ఎ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.హెచ్. దేశాయ్, జై దేశాయ్, వి.ఆర్.టి 68 ఛైర్మన్ వెలగపూడి వీర రాఘవ చౌదరి, కార్యదర్శి డాక్టర్ ప్రఫుల్, విఎల్ సి ఛైర్ పర్శన్ వెలగపూడి విమలాదేవి, కార్యదర్శి కె. శాంతి, స్పోర్ట్ కన్వీనర్ గ్రంధి ప్రశాంత్, సభ్యులు కొణిజేటి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డిని చంపేస్తామంటూ స్టాలిన్ ఫ్యాన్స్ వార్నింగ్, రాజకీయాల్లోకి వస్తున్నానంటున్న శ్రీరెడ్డి