Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్.జగన్ దూకుడుకు బ్రేక్... రేపు టీడీపీలోకి ఉప్పులేటి కల్పన

పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని దూసుకెళుతున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి బ్రేక్ పడనుంది. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఉప్పలేని కల్పన అధికార టీడీపీలో చేరనున్నారు.

Advertiesment
వైఎస్.జగన్ దూకుడుకు బ్రేక్... రేపు టీడీపీలోకి ఉప్పులేటి కల్పన
, గురువారం, 22 డిశెంబరు 2016 (12:05 IST)
పెద్ద నోట్ల రద్దు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని దూసుకెళుతున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి బ్రేక్ పడనుంది. వైకాపాకు చెందిన ఎమ్మెల్యే ఉప్పలేని కల్పన అధికార టీడీపీలో చేరనున్నారు. ఈమె వైసీపీ శాసనసభాపక్ష ఉపనేతగా కూడా ఉన్నారు. కృష్ణా జిల్లా పామర్రు అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 
 
బుధవారం ఉదయం విజయవాడలో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు కళావెంకట్రావు నివాసానికి వెళ్లిన ఆమె టీడీపీలో చేరే విషయాన్ని అధికారికంగా చెప్పారు. ఆ తర్వాత ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ... ‘జగన్‌ వ్యవహార శైలి రాజకీయంగా బాగుండడం లేదు. వైసీపీ బలహీనపడుతోంది. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు రావాలని నిశ్చయించుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షత వల్ల రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరుగుతోంది. టీడీపీలో చేరితే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని భావిస్తున్నాను’ అని చెప్పారు. వైకాపా నుంచి టీడీపీలో చేరనున్న 21వ ఎమ్మెల్యే కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం పన్నీర్‌సెల్వం అనుమతితో రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ సోదాలు