Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దసరాకు 2 వేల ప్రత్యేక బస్సులు

Advertiesment
దసరాకు 2 వేల ప్రత్యేక బస్సులు
, గురువారం, 15 అక్టోబరు 2020 (08:18 IST)
దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. మొత్తం 2,028 ప్రత్యేక బస్సులను ఈ పండగ సీజన్‌లో నడపనుంది.

అయితే, తెలంగాణ, ఏపీ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం పరిష్కారం కాని నేపథ్యంలో భారీ డిమాండ్‌ ఉండే హైదరాబాద్‌ను మాత్రం ఈ స్పెషల్స్‌ జాబితా నుంచి పక్కన పెట్టింది. అంటే.. హైదరాబాద్‌కు బస్సులు లేకుండానే పండగ స్పెషల్స్‌ నడవనున్నాయి.

ఈ మేరకు దసరా స్పెషల్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఈడీ(ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. డిమాండ్‌ను బట్టి మరిన్ని బస్సులు నడపటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనన, మరణ ధ్రువీకరణకు ఆధార్‌ తప్పనిసరికాదు