Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 పుర, నగర పాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు

Advertiesment
13 పుర, నగర పాలక సంస్థల్లో ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు
, సోమవారం, 18 అక్టోబరు 2021 (08:50 IST)
నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు మరో 12 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. వీటిలో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన షెడ్యూల్‌ని విడుదల చేసింది.
 
గుర్తించిన పోలింగ్‌ కేంద్రాల వివరాలతో ఈనెల 19న ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేయాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 
వీటిపై ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి 23న తుది నోటిఫికేషన్‌ ఇవ్వాలని పేర్కొంది.
 
కోర్టు కేసులు, ఇతరత్రా అభ్యంతరాల్లేని నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు బుచ్చిరెడ్డిపాళెం (నెల్లూరు జిల్లా), ఆకివీడు (పశ్చిమ గోదావరి), జగ్గయ్యపేట, కొండపల్లి (కృష్ణా), గురజాల, దాచేపల్లి (గుంటూరు), దర్శి (ప్రకాశం), కుప్పం (చిత్తూరు), బేతంచెర్ల (కర్నూలు), కమలాపురం, రాజంపేట (కడప), పెనుకొండ (అనంతపురం) పురపాలక సంఘాల్లో పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. 
 
ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు.  అదే విధంగా మరో 20 పుర, నగరపాలక సంస్థల్లోనూ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మృతి చెందడంతో ఖాళీ అయిన స్థానాలకూ ఎన్నికలు నిర్వహించే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మావోయిస్టు శ్వేత లొంగుబాటు