Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీనియర్ల వేధింపులు తాళలేక 12 ఏళ్ల పసివాడి ఆత్మహత్య!

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే ఆశ్రమ బడిలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేని 12 యేళ్ళ బాలుడు ఒకడు... ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన జరిగింది. ఈ వివరాల

Advertiesment
east godavari
, ఆదివారం, 7 ఆగస్టు 2016 (10:49 IST)
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. స్థానికంగా ఉండే ఆశ్రమ బడిలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేని 12 యేళ్ళ బాలుడు ఒకడు... ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తూర్పుగోదావరి జిల్లా తోటపల్లి పంచాయతీ కుసుమనపల్లి గ్రామానికి చెందిన సున్నం బుచ్చిబాబు, నాగమణి దంపతుల కుమారుడు సున్నం బన్నీ (12). కొత్తూరు నారాయణపురం ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలోని ఉన్నత తరగతి విద్యార్థులు బన్నీని ర్యాగింగ్‌ పేరిట వేధింపులకు గురిచేస్తూ వచ్చారు. ఎక్కడ కనిపించినా ఎగతాళిగా మాట్లాడేవారు. ఆ విషయం క్లాసు టీచర్లకు చెప్పినా ఉపయోగం లేకపోయింది. 
 
హాస్టల్‌ వార్డెన్‌ కూడా పట్టించుకోలేదు. హెడ్‌మాస్టర్‌ను కలిసి గోడు చెప్పుకున్నా బన్నీకి రక్షణ లభించలేదు. ఈ స్థితిలో బన్నీ తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు. శనివారం చెప్పాపెట్టకుండా ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. సరాసరి వంటింట్లోకి వెళ్లి కిరోసిన్‌ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకొన్నాడు. స్థానికులు అప్రమత్తమై బన్నీని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడనుంచి వరంగల్‌కు తీసుకెళుతుండగానే బన్నీ ప్రాణాలు పోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితుడంటే ఎవరనుకుంటున్నారు...?(ఆదివారం స్నేహితుల దినోత్సవం)