Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా?

Advertiesment
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా?
, ఆదివారం, 13 మార్చి 2022 (10:52 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదాపడనున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించే అంశంపై ఆలోచన చేస్తున్నారు. అయితే, ఈ రెండు పరీక్షలు ఒకేసారి నిర్వహించడం సాధ్యంకాదని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిజానికి ఈ పదో తరగతి పరీక్షలు మే 2వ తేదీ నుంచి ప్రారంభంకావాల్సివుంది. కానీ, ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇటీవల పరీక్షల షెడ్యూల్లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను ఒకేసారి నిర్వహించాలని భావిస్తున్నారు. 
 
కొత్త షెడ్యూల్‌ను రూపొందించి, ప్రభుత్వ అనుమతి కోసం విద్యాశాఖ పంపించింది. ఈ కొత్త షెడ్యూల్ సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు మాత్రం ఇటీవల ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 12వ తేదీ వరకు జరగాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగ్గయ్యపేటలో ఘోర రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం