Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హస్తినాపురికి వెళ్లిన సీఎం

హస్తినాపురికి వెళ్లిన సీఎం
, సోమవారం, 13 అక్టోబరు 2008 (11:07 IST)
జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోమవారం హస్తినాపురికి బయలుదేరి వెళ్లారు. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి హాజరవ్వడంతో పాటు రైతుల సమస్యలు, నేత కార్మికుల సమస్యల పరిష్కారం, వరికి మద్దతు ధర సాధించడం తదితర అంశాలు ప్రధాన ఏజెండాగా సీఎం రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

సోమవారం జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అంతర్గత భద్రత, ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి తీసుకోవాల్సిన సత్వర చర్యలు, తదితర అంశాలపై ఆయన ప్రసంగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

బడుగు వర్గాల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదుల అలజడులను అరికట్టడానికి తీసుకోవల్సిన చర్యలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సీఎం భేటీ అవుతారు. వరికి వెయ్యి రూపాయల మద్దతు ధర, ఎరువుల కోటా పెంపు తదితర అంశాలపై సీఎం ప్రధానమంత్రితో చర్చిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదే రోజు సాయంత్రం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖమంత్రి పాశ్వాన్‌ను కలిసి రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రాష్ట్రానికి ఎరువుల పంపిణీ తదితర అంశాలపై సీఎం చర్చిస్తారు. మంగళవారం రాత్రి ఢిల్లీనుంచి విమానంలో ముఖ్యమంత్రి భాగ్యనగరానికి చేరుకుంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Share this Story:

Follow Webdunia telugu