రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ అసంతృప్తి ఒక్కసారి బయటపడింది. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడాన్ని నిగ్రహించుకోలేక పోయిన రాజకీయ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా గురువారం సాయంత్రంలోగా సామూహిక రాజీనామా చేయాలని రాయలసీమ, ఆంధ్ర, కోస్తా ప్రాంతాలకు చెందిన ఎంపీలు నిర్ణయించుకున్నారు.
దీనిపై వారంతా ఢిల్లీలో సమావేశమై తర్జన భర్జనలు పడుతున్నారు. ఇప్పటికే, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్, గంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, అనంతపురం ఎంపీ అనంతవెంకట్రామి రెడ్డి, తెదేపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు ఎం.మైసూరా రెడ్డిలు రాజీనామాలు చేశారు. వీరిలో కొందరు స్పీకర్ మీరా కుమార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తమ రాజీనామా లేఖలను సమర్పించారు.