1959 జులై 23వ తేదీ ఓరుగల్లుకే గర్వకారణమయిన రోజు. వేలాది మందిని వైద్యులుగా తీర్చిదిద్ది లక్షల ప్రాణాలను నిలబెడుతున్న కాకతీయ మెడికల్ కాలేజి
ఆవిర్భవించిన రోజు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. "వందేమాతరం" గీతంతో ప్రారంభమైన దీపాల ప్రదర్శన అందరిని ఆకర్షించింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ప్రిన్సిపాల్ టాండాన్ కేక్ కట్‌చేసి ఉత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులకు ఇటువంటి ఉత్సవాలు ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాలకు చెందిన పలువురు అధ్యాపకులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.