రాష్ట్రాభివృద్ధికి టీడీపీ చేసిందేమీలేదు: ఆర్థిక మంత్రి ఆనం
రాష్ట్రాన్ని తొమ్మిదేళ్ల పాటు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని రాష్ట్ర ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ వల్లే సాధ్యమని ఆనం తెలిపారు. చేజర్ల, ఏఎస్‌పేట మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థి టీ సుబ్బరామిరెడ్డిని గెలిపించాలని ఆనం ఓటర్లను కోరారు. ఉప ఎన్నికల్లో భాగంగా ఏఎస్‌పేట మండలం ఏఎస్‌పేట, అనుమసముద్రంలో మంత్రి ఆనం, టీఎస్సార్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ 25లక్షల రూపాయలతో సంగం, హసనాపురం, ఆత్మకూరు వరకు డబల్‌రోడ్డు వేసేందుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. తొమ్మిదికోట్ల రూపాయలతో పలుగ్రామాలకు త్రాగునీరు అందించే పథకం పనులు జరుగుతున్నాయన్నారు.