Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భైంసా ఘటన బాధాకరం : చిరంజీవి

Advertiesment
భైంసా ఘటన బాధాకరం : చిరంజీవి
, సోమవారం, 13 అక్టోబరు 2008 (12:36 IST)
ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో జరిగిన హింసాత్మక దహన కాండ బాధాకరమని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా అంకిత యాత్ర చేపడుతున్న ఆయన సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడారు.

నిఘావర్గాల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని చిరంజీవి ఆరోపించారు. ఇరువర్గాల వారు దాడులను తక్షణమే నిలిపివేయాలని మెగాస్టార్ విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ ఘటనలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా.. సీపీఎం పార్టీ నేతల పిలుపు మేరకే తమ పార్టీ నేతలు న్యూఢిల్లీకి వెళ్లి సీతారాం ఏచూరీని కలిశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొత్తులు కుదుర్చుకోవడంపై తాము ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని చిరంజీవి తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu