Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి ఖమ్మం జిల్లాలలో సీఎం నల్లారి ఇందిరమ్మ బాట!

Advertiesment
ఖమ్మం జిల్లా
, బుధవారం, 8 ఆగస్టు 2012 (11:54 IST)
File
FILE
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈనెల పదో తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమం బుధవారం పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల సందర్శనతో ఆరంభమవుతుంది.

అక్కడి నుంచి ఐలాపురం గ్రామానికి చేరి బహిరంగసభలో ప్రసంగిస్తారు. తదుపరి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో శిశు సంజీవిని, అక్షయను ప్రారంభిస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు.

కూనవరం మండలం బండారుగూడెంలో కొండరెడ్లు, ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలతో సమావేశమవుతారు. రాత్రి 8.30 గంటలకు వరరామచంద్రాపురం మండలం సున్నంవారిగూడెం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల సందర్శనతో తొలి రోజు ఇందిరమ్మ బాట కార్యక్రమం పూర్తవుతుంది. ఈ రాత్రికి ఈ పాఠశాలలోనే బస చేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu