రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిన స్థానాలను సాధించే దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటివరకూ ఆధిక్యపు సరళిని చూస్తే కాంగ్రెస్ పార్టీ 144 స్థానాలలో ముందున్నది.
మహాకూటమి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రజారాజ్యం పార్టీ కుదేలైంది. కేవలం రెండంకెల మార్కుతోనే సరిపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోంది. కింగ్- కింగ్ మేకర్.. రెండింటికీ అందనంత దూరంలో ఎన్నికల ఫలితాలు పీఆర్పీని నెట్టేసినట్లు కనిపిస్తోంది.
ఇక తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ ఎదురీదుతున్నారు. తెరాసకు ఈసారి భంగపాటు ఎదురైనట్లు కనిపిస్తోంది. సీపీఎం పార్టీని రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లు కనబడుతోంది. మొత్తమ్మీద రాష్ట్రంలో ఏ పార్టీ పొత్తూ అవసరం లేకుండానే వైఎస్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారని ఆధిక్యపు సరళి చూపిస్తోంది.