Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కారు నుంచి దూకేసిన రోజా.. పట్టుకున్నారు.. హామీ ఇస్తే వదిలేస్తాం.. ఏపీ డీజీపీ

అమరావతిలో జరుగుతున్న పార్లమెంటేరియన్ల సదస్సుకు వెళ్ళిన వైకాపా ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఆమెను గుంటూరు జిల్లా వైపు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ జీపు పేరేచర్ల చేరుక

కారు నుంచి దూకేసిన రోజా.. పట్టుకున్నారు.. హామీ ఇస్తే వదిలేస్తాం.. ఏపీ డీజీపీ
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (14:45 IST)
అమరావతిలో జరుగుతున్న పార్లమెంటేరియన్ల సదస్సుకు వెళ్ళిన వైకాపా ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు పోలీసులు. ఆమెను గుంటూరు జిల్లా వైపు తరలించారు. ఈ క్రమంలో పోలీస్ జీపు పేరేచర్ల చేరుకుంది.  పేరేచర్ల సెంటర్‌లో ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద పోలీస్ జీపు నుంచి రోజా దూకేశారు. అంతేకాదు, కాపాడండి అంటూ కేకలు వేసుకుంటూ రోడ్డుపై పరుగులు తీశారు. ఆమెను వెంబడించి పట్టుకున్న పోలీసులు మళ్లీ పోలీస్ వాహనం ఎక్కించారు. ఆ తర్వాత పోలీస్ జీపు సత్తెనపల్లి వైపుగా బయల్దేరింది.

ఈ కారులో వెళ్తుండగానే రోజా సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తుండగానే పోలీసులు ఆమె ఫోనును లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా పోలీసుల అదుపులో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోషల్ మీడియాలో రోజా చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఆమెను గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

రోజా వల్ల మహిళా పార్లమెంట్ సదస్సుకు ఇబ్బంది కలుగుతుందనే ముందస్తుగా అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు తరలిస్తున్నామని డీజీపీ వెల్లడించారు. మహిళా పార్లమెంట్ సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేయబోనని రోజా హామీ ఇస్తే సదస్సుకు అనుమతించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీకి నాయకత్వం కరువు... ఎందుకు..?