Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబు తలపెట్టింది.. నవనిర్మాణ దీక్ష కాదు.. నారావారి నయవంచన దీక్ష: రోజా ఫైర్

తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంపై ఆ రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారంటే.. అర్థముందని, కానీ ఏపీలో వారం రోజుల ఈ హంగామా ఏమిటని వైసీపీ ఎమ్మెల్యే రోజా అడిగారు. ఏపీలో నవనిర్మాణ దీక్షల పేరిట సంబరాలు

Advertiesment
YSRCP MLA
, శుక్రవారం, 2 జూన్ 2017 (12:36 IST)
తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంపై ఆ రాష్ట్రంలో సంబరాలు చేసుకున్నారంటే.. అర్థముందని, కానీ ఏపీలో వారం రోజుల ఈ హంగామా ఏమిటని వైసీపీ ఎమ్మెల్యే రోజా అడిగారు. ఏపీలో నవనిర్మాణ దీక్షల పేరిట సంబరాలు జరుపుకోవడమేమిటని రోజా వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు ప్రారంభించినది నవనిర్మాణ దీక్ష కాదని, అది నారా వారి నయవంచన దీక్ష అని అన్నారు. రాష్ట్రం విడిపోయి ప్రజలు బాధలు పడుతుంటే ఈ దీక్షల పేరిట సంబరాలు జరుపుకుంటారా అంటూ చంద్రబాబును రోజా నిలదీశారు.
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఆయన ప్రారంభించింది నవ నిర్మాణ దీక్ష కాదని... నారావారి నయవంచన దీక్ష అని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయి ప్రజలంతా ఇబ్బందుల్లో ఉంటే... చంద్రబాబు మాత్రం నవ నిర్మాణ దీక్షతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అవినీతిపై పోరాటం చేయాలంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు మిలీనియం జోక్ అని ఎద్దేవా చేశారు. ఇంతవరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కాణిపాకం వినాయకుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? అంటూ చంద్రబాబుకు ఆమె సవాల్ విసిరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా బిడ్డ హత్యను సినిమాగా నిర్మించవద్దు: స్వాతి తండ్రి గోపాలకృష్ణన్