వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఏపీలో అన్ని పంచాయితీలకు గ్రామ క్లినిక్ ఏర్పాటు చేసేందుకు సీం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారు. రాష్ట్రంలో దాదాపు 13 వేల క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో 54 రకాల మందులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
కరోనా విషయంలో దేశంలోనే పరీక్షలు, వైద్య సేవలు అందించడంలో ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం గ్రామ స్థాయిలో క్లినిక్‌లు అందుబాటులోకి తేవడంలో ముందంజ వేస్తున్నది. ఈ విషయాన్ని సీఎం జగన్ గురువారం ఆరోగ్యశ్రీ విస్తరణ కార్యక్రమంలో తెలిపారు. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రిలో మాదిరిగా నాణ్యమైన వైద్య సేవలు అందించబడుతాయని తెలిపారు.