Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నుదిటిపై బాది, నోట్లో గుడ్డలు కుక్కి.. కోడలిని అంతమొందించిన అత్తామామ...

కట్టుకున్న పురుషుడిని కాదనీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ కుటుంబ పరువు తీస్తుందని భావించిన అత్తామామలు కలిసి కోడలిని నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. అదీకూడా అత్యంత దారుణంగా చంపేశారు.

నుదిటిపై బాది, నోట్లో గుడ్డలు కుక్కి.. కోడలిని అంతమొందించిన అత్తామామ...
, శుక్రవారం, 1 జూన్ 2018 (09:21 IST)
కట్టుకున్న పురుషుడిని కాదనీ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని తమ కుటుంబ పరువు తీస్తుందని భావించిన అత్తామామలు కలిసి కోడలిని నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. అదీకూడా అత్యంత దారుణంగా చంపేశారు. గొంతు నులిమి, నుదిటిపై బాది, నోట్లో గుడ్డలు కుక్కి, కర్రతో వాతలు పెట్టి హత్య చేశారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్‌ మండలం ఆరేడ్‌ గ్రామంలో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గ్రామానికి చెందిన కుర్మ మల్లయ్య, సాయవ్వ అనే దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కూర్మబాబుకు మతిస్థిమితం లేదు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిపేట గ్రామానికి చెందిన కుర్మ సుమలత (21) అలియాస్‌ రేణుకతో కూర్మబాబుకు పెళ్లి చేశారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు గణేశ్‌ ఉన్నాడు. 
 
అయితే, తన భర్త ద్వారా దాంపత్య సుఖం పొందలేకపోయిన రేణుక.. అదే గ్రామంలోని మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై రేణుకను అత్తామామలు మందలించారు. దీంతో వారికి తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. దీనిని మనస్సులో పెట్టుకున్న అత్తామామలు రేణుకను హత్య చేసేందుకు ఓ పథకం వేశారు. 
 
ఆ ప్లాన్‌లో భాగంగా, ఇంట్లో నిద్రిస్తున్న రేణుకను అర్థరాత్రి వేళ అత్తామామ గొంతు నులిమి, నోట్లో గుడ్డలు కుక్కి, నుదిటపై బాదారు. అంతటితో ఆగకుండా చేతులు, వీపు భాగంలో కర్రతో వాతలు పెట్టారు. అప్పటే రేణుక మృతిచెందడటంతో బాత్‌రూం వద్ద మృతదేహాన్ని పడుకోబెట్టారు. కరెంట్‌ షాక్‌తో మృతి చెందినట్లు నటించారు. ఆ తర్వాత ఇరుగుపొరుగువారు సంఘటన స్థలానికి చేరుకుని జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 
 
మృతదేహాన్ని శవపరీక్షకు పంపిన పోలీసులు.. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు గుర్తించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు అత్త సాయవ్వ, మామ మల్లయ్యపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజా విసరడానికి కూడా శక్తికావాలి: బైపోల్ రిజల్ట్స్‌పై రాజ్‌నాథ్