Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లాడ్జిలో ప్రియురాలితో ఎంపీడీవో భర్త.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య...

romance

ఠాగూర్

, సోమవారం, 28 అక్టోబరు 2024 (08:58 IST)
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ఇవి పలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. ప్రియురాళ్ల మోజులో పడి కట్టుకున్న భార్యలను పలువురు మగరాయుళ్లు వదిలివేస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి భార్య లేదా భర్తను చంపేస్తున్నారు కూడా. తాజాగా ఓ ఎంపీడీవో అధికారి ఒకరు తన ప్రియురాలితో లాడ్జిలో రొమాన్స్ చేస్తుండగా అతని భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పని చేస్తున్న అధికారి ఒకరు... గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చిత్తూరు జిల్లాకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఏఎన్ఎం ఒకరు పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన కుటుంబానికి దూరమయ్యారు. భార్యాపిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. కనీసం ఇంటికి కూడా రావడం లేదు. భర్త ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పు రావడంతో భార్య, ఆమె కుటుంబ సభ్యులు నిఘా వేశారు. 
 
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులోని ఒక లాడ్జిలో తన ప్రియురాలితో ఎంపీడీవో అధికారి ఉన్నట్లు గుర్తించి భార్య, కుమార్తె, కుమారుడు అక్కడకు చేరుకున్నారు. ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని స్వయంగా పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని ఎంపీడీవో, ఆయన ప్రియురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్ఐ అనిత వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుకోవాలనీ, వీధులకెక్కి పరువు తీసుకోవద్దని హితవు పలికారు. లేదంటే న్యాయస్థానాల్లో తేల్చుకోవాలి తప్ప ఘర్షణకు దిగవద్దని ఎస్ఐ అనిత హితవు చెప్పి పంపించారు. స్థానికంగా ఈ సంఘటన కలకలం సృష్టించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం జిల్లాలో దారుణం.. సోదరిపై అన్న లైంగికదాడి..