విఐపిలతో తిరుమల ఈరోజు సందడిగా మారింది. ఉదయం విఐపి విరామ దర్సనా సమయంలో చాలామంది విఐపిలు శ్రీవారిని దర్సించుకున్నారు. రాజకీయ నేతల నుంచి క్రీడాప్రముఖుల వరకు అందరూ శ్రీవారిని దర్సించుకున్నారు. ఇందులో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి శ్రీవారిని దర్సించుకున్న తరువాత ఆలయం వద్ద చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీస్తున్నాయి.
ఎపి ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసే డబ్బులను ఒక మతానికే ఖర్చు చేస్తోందన్నారు. అన్ని మతాలకు సమానంగా ఎందుకు డబ్బులను ఖర్చు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు విష్ణువర్ధన్ రెడ్డి.
చర్చీలకు, పాస్టర్లకు అవసరమైన వేతనాలపైనే ఎక్కువగా రాష్ట్రప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులోను వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాము. ఇది మరీ దారుణమైన ఘటన అంటూ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.