Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నవ్యాంధ్ర దశలవారీగా మద్య నిషేధం...

నవ్యాంధ్ర దశలవారీగా మద్య నిషేధం...
, ఆదివారం, 8 డిశెంబరు 2019 (13:11 IST)
నవ్యాంధ్రలో దశల వారీగా మద్య నిషేధం అమలు తథ్యంగా కనిపిస్తోంది. సీఎం జగన్ ఆశయానికి అనుగుణంగా 40 శాతం మేరకు బార్ లైసెన్సులు తగ్గించగా మిగిలిన బార్ లైసెన్సులకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా 10 లక్షల రూపాయలు లాటరీలో పాల్గొనుటకు ప్రవేశ రుసుము చెల్లించి డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం మూడు గంటల వరకు సమయం ఖరారు చేసి రాత్రి 8 గంటల వరకు డిప్యూటీ కమిషనర్ ఆఫీసు నందు అప్లికేషన్ దాఖలు చేసి లాటరీలో పాల్గొనే అర్హత పొంద వలసినదిగా పేర్కొనడం జరిగినది. 
 
నిర్ణయించిన గడువు ప్రకారంగా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగానే తక్కువ సంఖ్యలోనే అప్లికేషన్‌లు నమోదు కాబడినవి మరియు 6 వ తేదీన సాయంత్రం మూడు గంటలకు ఆన్‌లైన్‌ను ప్రక్రియ మూసి వేయడం అయినది. 
 
మరల మొదట పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వారు సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభించి దానిని సోమవారం అనగా డిసెంబర్ 9 వరకు పొడిగించడం జరిగినది.
 
జీవో ప్రకారంగా సక్రమంగా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నమోదు కాబడి డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో వెరిఫికేషన్ కూడా పూర్తి చేయించుకున్న అప్లికేషన్ దాఖలు చేసిన వారందరూ నిరసన వ్యక్తపరుస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నది.
 
మద్యపాన నిషేధం దశలవారీగా అమలు చేయాలనే ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పమునకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ వారు, వారి సొంత నిర్ణయాలతో తూట్లు పొడుస్తున్నారు. మద్యపాన నిషేధం గురించి ప్రభుత్వం చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు వివిధ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్యాంగులను చిన్న చూపు చూడటం తగదు : మంత్రి హరీష్ రావు