Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు... మునకేసిన పవర్ హౌస్

Advertiesment
water flow to jurala project of mahaboob nagar district
, గురువారం, 31 జులై 2014 (12:05 IST)
భారీ వర్షాలు కర్ణాటక రాష్ట్రాన్ని ముంచెత్తుతుండటంతో కర్ణాటక సరిహద్దుల్లో వున్న మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతూ ఉంది. దీంతో జూరాలా ప్రాజెక్టు ఇన్ ఫ్లో 97,300 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఔట్‌ఫ్లో 78,600 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
 
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో దాని ప్రస్తుత నీటిమట్టం 317.70 అడుగులకు చేరినట్లు అధికారులు చెప్పారు. ఇక్కడ గరిష్ట నీటిమట్టం 318.52 అడుగులుగా ఉంది. మరోవైపు వరదల వల్ల పవర్ హౌస్ నీటిలో మునకకు గురయింది.

Share this Story:

Follow Webdunia telugu