Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నలుగురు యువతులను లొంగదీసుకుని ఆపై...

Advertiesment
నలుగురు యువతులను లొంగదీసుకుని ఆపై...
, శుక్రవారం, 22 మే 2020 (14:03 IST)
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు స్వాధార్ గృహంలో దారుణం చోటుచేసుకుంది. అక్కడ పనిచేసే వాచ్‌‌మెన్ నలుగురు మహిళలకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని వారి జీవితం నాశనం చేసాడు. అంతేకాకుండా వ్యభిచార రొంపిలోకి దించాలని కూడా ప్రయత్నించాడు. లాక్‌డౌన్ కారణంగా స్వాధార్ హోమ్‌లో కొంత మంది మహిళలు అక్కడే ఉండవలసి వచ్చింది. 
 
అక్కడ వాచ్‌మెన్‌గా పనిచేసే రెడ్డిబాబు వారిపై కన్నేశాడు. వారి బలహీనతలను ఆధారంగా చేసుకుని మాయమాటలు చెప్పి నలుగురు యువతులను లోబర్చుకున్నాడు. వారితో తరచూ కోర్కెలు తీర్చుకుంటున్నాడు. అంతటితో ఆపకుండా వ్యభిచారం చేయాలంటూ ఆ మహిళలను ఒత్తిడి చేసేవాడు. వారు అంగీకరించకపోవడంతో నగ్న చిత్రాలు విడుదల చేస్తానని, స్నానం చేసేటప్పుడు తీసిన ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు.
 
అతని వేధింపులు ఎక్కువవడంతో బాధిత యువతులు వార్డెన్‌ను ఆశ్రయించగా ఆమె కూడా వాచ్‌మెన్‌కి వత్తాసు పలికింది. రెడ్డిబాబు తన బంధువులు, స్నేహితులను హాస్టల్‌‌కు తీసుకొచ్చి వారికి సుఖం అందించాలంటూ యువతులను వేధించేవాడు. లొంగనివారిపై దాడి చేసి బలవంతంగా గదిలోకి తోసేవాడు. ఈ విధంగా ఆ హోమ్‌ని ఒక వ్యభిచార గృహం చేసాడు.
 
వారు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియని సమయంలో వార్డెన్ అరుణ కొద్దిరోజుల క్రితం సెలవు తీసుకుని వెళ్లింది. ఇంఛార్జ్ వార్డెన్‌గా ఉన్న ఇందిరకు చెప్పగా ఆమె ధవళేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెడ్డిబాబుపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నకూతురినే కాటేసిన తండ్రి.. ఎక్కడ?