Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేషన్ కార్డు ఉంటే చాలు.. 8 దేవాలయాలను ఉచితంగా దర్శించుకోవచ్చు: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు. దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ

Advertiesment
Vijayawada : CM Chandrababu flagged off 'Divya Darshanam' - 1
, సోమవారం, 2 జనవరి 2017 (09:35 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దివ్యదర్శనం పథకాన్ని ప్రారంభించారు.  దివ్యదర్శనం పథకం కింద ఏపీలోని 8 పెద్ద దేవాలయాలను భక్తులు దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతిజిల్లాలో నాలుగు ప్రత్యేక బస్సులను దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. రవాణా ఖర్చుతో పాటు భక్తులకు ఉచితంగా దర్శనం, వసతి, భోజనం వసతులు కల్పిస్తారు. సోమవారం ఉదయం విజయవాడలో సీఎం చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభమైంది. 
 
ఈ పథకం ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దివ్యదర్శనం కార్యక్రమాన్ని ప్రారంభించిన దేవాదాయశాఖను అభినందిస్తున్నానని వెల్లడించారు. రేషన్‌కార్డు ఉంటే చాలు ఈ పథకం కింద రవాణా, దర్శనం, వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తారని వెల్లడించారు.
 
భక్తులను ఇంటికి వచ్చిన అతిథులుగా చూసే బాధ్యత దేవాదాయశాఖ తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. తిరుమలకు వైకుంఠమాల పేరుతో కొత్తరోడ్డు మార్గం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెజవాడలో కలకలం... రౌడీషీటర్‌ను నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపారు