Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీని మరో శ్రీలంక చేయాలన్నదే చంద్రబాబు కల : విజయసాయి

vijayasai reddy
, బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేయాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా పరితపిస్తుందని వైకాపా నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఏపీని శ్రీలంక చేయాలన్నది చంద్రబాబు కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు బాబు పగటి కలలు కంటున్నారు. అందుకే ఆ అక్షర దౌర్భాగ్యుడు బాబు నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఎల్లో మీడియా దాన్ని ప్రధాన వార్తగా ప్రచురించడం జరుగుతుంది. ఈ పరిస్థితి 2024 ఎన్నికల వరకు తప్పేలా కనిపించడం లేదన్నారు. 
 
2024 తర్వాత పార్టీ లేదు బొక్కాలేదు అనడం ఖాయమని ఆయన అన్నారు. గత ఎన్నికల తర్వాత చంద్రబాబును, టీడీపీని డస్ట్‌పిన్‌లో వేసినప్పటికీ ఎల్లో మీడియా మాత్రం పగటి కలలు కనడం లేదన్నారు. అందుకే ఏపీని మరో శ్రీలంక చేసేందుకు బాబు కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారన్నారు. గత యేడాది జాతీయ తలసరి ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు, రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.08 లక్షలు. అంతకుముందు యేడాది కంటే రూ.31 వేలు పెరిగిందని ఆయన చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌలు రైతుల కోసం జనసేనాని పరామర్శ యాత్ర.. ఏప్రిల్ 12 నుంచి..