Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరు: రోజా

Advertiesment
జగన్ లాంటి ముఖ్యమంత్రి దేశంలోనే లేరు: రోజా
, బుధవారం, 23 జూన్ 2021 (19:27 IST)
ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్ రోజా. దేశంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి లేరన్నారు. మహిళా భద్రత కోసం సిఎం నిరంతరం ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
 
ప్రకాశం బ్యారేజ్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి ఒక మహిళపై అత్యాచారం చేసి నిందితులు పారిపోయినా ఇంతవరకు పోలీసులు పట్టుకోకపోవడంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. బాధితురాలిని పరామర్సించిన టిడిపి నేతలు అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు.
 
ప్రతిపక్షాల విమర్సలపై తీవ్రస్థాయిలో స్పందించారు ఎపిఐఐసి ఛైర్ పర్సన్. మహిళలకు జగన్మోహన్ రెడ్డి రక్షణ కల్పించిన విధంగా ఏ ముఖ్యమంత్రి దేశంలో రక్షణ కల్పించడం లేదన్నారు. జగన్ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఘటన జరిగిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సరైంది కాదన్నారు. అసలు ఇలాంటి ఘటనలు బాధాకరమన్నారు.
 
జగన్మోహన్ రెడ్డి డిజిపితో మాట్లాడారని... ఆరు టీంలు ప్రత్యేకంగా వేశారని.. ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించారన్నారు. అంతేకాకుండా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నారని కూడా రోజా చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు రోజా. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం మానుకుంటే బాగుంటుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మడమ తిప్పని సీఎం జగన్మోహన్ రెడ్డి : పవన్ కళ్యాణ్ సెటైర్లు