Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబుకు పుట్టినరోజు.. కేసీఆర్ శుభాకాంక్షలు, చిరంజీవి చంద్రబాబునాయుడన్న జేసీ

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. కేసీఆర్ శుభాకాంక్షలకు చంద్రబాబు కృతజ్ఞతలు

Advertiesment
చంద్రబాబుకు పుట్టినరోజు.. కేసీఆర్ శుభాకాంక్షలు, చిరంజీవి చంద్రబాబునాయుడన్న జేసీ
, గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడపాలని ఆకాంక్షించారు. కేసీఆర్ శుభాకాంక్షలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతకాలం గడిచినా.. తెలుగు ప్రజలు కలిసుండాలని తాను కోరుకుంటున్నట్లు బాబు ఆశించారు.  
 
కాగా హైదరాబాద్‌లో బాబు జన్మదినం సందర్భంగా జరిగిన వేడుకలకు తెలుగుదేశం నేతలు ఎల్ రమణ, రావుల, మోత్కుపల్లి, పెద్దిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రక్తదాన శిబిరంలో కార్యకర్తలు రక్తదానం చేశారు. అలాగే ఏపీలోనూ బాబు బర్త్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. అనంతపురం జిల్లా పామిడిలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. రాష్ట్రానికి పోలవరం అత్యంత ప్రధానమైన ప్రాజెక్టని, నెహ్రూ నుంచి చంద్రబాబు వరకూ ఎందరో కలలు కన్న ప్రాజెక్టు అని.. తన శక్తియుక్తులతో పోలవరం ప్రాజెక్టును సాధించిన ఏపీ సీఎం చంద్రబాబు హ్యాట్రాఫ్ అన్నారు.   
 
ఇంకా 'చిరంజీవి చంద్రబాబునాయుడు..' అంటూ ప్రసంగాన్ని ప్రారంభించి, తాను ఎందుకు ముఖ్యమంత్రిని చిరంజీవి అంటున్నానో చెప్పుకొచ్చారు. బాబుకేమో 68వ జన్మదినోత్సవం.. తనకేమో 72. అందుకనే సీఎంను చిరంజీవి అని సంబోధిస్తున్నానని తెలిపారు. నీటి విషయంలో చంద్రబాబు చేస్తున్న కృషి ఎంతో గొప్పదని, ప్రజలంతా కూడా మెచ్చుకుంటున్నారని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తమిళనాడులో బిజెపి గేమ్... ఎందుకు...?