Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్: ఇది ఎన్నికల బడ్జెట్ కాదు.. ప్రజా బడ్జెట్.. ఈటెల

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈటెల బడ్జెట్ ప్రసంగం గంటా 20 నిమిషాల పాటు కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీలో ఐదోసారి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశ

Advertiesment
Telangana Budget
, గురువారం, 15 మార్చి 2018 (17:19 IST)
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2018-19ని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈటెల బడ్జెట్ ప్రసంగం గంటా 20 నిమిషాల పాటు కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీలో ఐదోసారి ఈటెల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీఎం కేసీఆర్ సర్కార్ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదే కావడం గమనార్హం. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేశారు.
 
కోళ్ల పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.109 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమానికి రూ. 1,023 కోట్లు, రజకుల ఫెడరేషన్‌కు రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 83,048 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చామని.. ప్రస్తుతానికి 27,588 ఉద్యోగ నియామకాలు పూర్తయ్యాయని ఈటెల ప్రకటన చేశారు. 
 
బడ్జెట్‌ కీలకాంశాలు.. 
వరంగల్‌కు రూ.300 కోట్లు
మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
సాంస్కృతిక శాఖకు రూ. 58 కోట్లు
ఆర్‌అండ్‌బీకి రూ. 5,575 కోట్లు
పురపాలక శాఖకు రూ. 7,251 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి రూ. 2,500 కోట్లు
వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 7,375 కోట్లు
విద్యాశాఖకు రూ. 10,830 కోట్లు
మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు
 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు
గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు
పట్టణాభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ కు రూ. 1450 కోట్లు
డబుల్ బెడ్ రూం ఇండ్లకు రూ. 2,643 కోట్లు
నీటిపారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు
పంటల పెట్టుబడి మద్దతు పథకానికి రూ. 12 వేల కోట్లు
 
రైతు బీమా పథకానికి రూ. 500 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 522 కోట్లు
బిందు తుంపర సేద్యం రూ. 127 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 2946 కోట్లు
మొత్తం బడ్జెట్‌.. రూ.1,74,453కోట్లు
రెవెన్యూ వ్యయం.. రూ.1,25,454 కోట్లు
రెవెన్యూ మిగులు రూ.5,520కోట్లు
ద్రవ్యలోటు అంచనా.. రూ.29,077కోట్లు
జీడీపీలో ద్రవ్య లోటు 3.45శాతం
కేంద్రం వాటా రూ.29,041కోట్లు
 
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఈటెల రాజేందర్ ప్రకటన చేశారు. ఇది ప్రజా బడ్జెట్ అని.. ఎన్నికల బిల్లు కాదని ఈటెల తెలిపారు. ఇక గురువారం సభలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.  ఇకపోతే.. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 27వ తేదీ వరకు జరుగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోడీ సర్కారుపై అవిశ్వాస .. నోటీసిచ్చిన వైకాపా.. టీడీపీ మద్దతు?