భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకులు తేజస్వి చౌదరి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలియజేసారు. భూమి ఫౌండేషన్, తెలుగుదేశం పార్టీలో గత కొన్నేళ్లుగా తనకు అండగా నిలిచి తమ రక్షణను అందించిన తన సోదరులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు... అంటూ తేజస్వి ట్వీట్ చేశారు.
తనకు సొంత అన్నదమ్ములు లేనప్పటికీ భూమి ద్వారా తెలుగుదేశం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో తనకు అండగా, రక్షగా నిలిచిన వేలాదిమంది సోదరులకు రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు అంటూ తేజస్విని అన్నారు.
ప్రపంచంలోనే అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనంగా పేర్కొనబడే రాఖీ పండుగను జరుపుకునే ఏకైక దేశం భారతదేశం. కానీ దేశంలో ఆడపడచులపై జరుగుతున్న అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
ఇలాంటి అఘాయిత్యాలు, అకృత్యాలు జరుగుతుంటే ఆ ఆడపడుచుకు అన్నలా, తమ్ముడిలా రక్షగా నిలవండని.. అన్యాయం జరిగే చోట ఆడపడుచులను కాపాడండి అంటూ తేజస్విని పిలుపునిచ్చారు.
భూమి ఫౌండేషన్ గురించి..
భూమి ఫౌండేషన్ అనేది ఉద్యమం. ఒంగోలులో జన్మించిన తేజస్వి చౌదరి 2015లో కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభించారు. అలాంటి భూమిని కాపాడుకోవడనికి తేజస్విని దీనిని ప్రారంభించారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రారంభించి, ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్‌కు విస్తరించారు.
ఒంగోలు నగరాన్ని పోస్టర్ రహిత నగరంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుండి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు అందుకున్నారు. ప్రెజెంట్ ఈ భూమి ఫౌండేషన్‌లో 1000+ మంది వాలంటీర్‌లుగా ఉన్నారు. ఆరు సంవత్సరాల పిల్లల నుండి.. 60 ఏళ్ల వయస్సులో ఉన్నవారు ఈ ఫౌండేషన్‌లో పనిచేస్తున్నారు.