టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే...
రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను రాజ్యసభలో కొనసా
రాజ్యసభ ఎన్నికల కోసం అభ్యర్థులను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ను రాజ్యసభలో కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. సీనియర్ నేత వర్ల రామయ్యకు అవకాశం ఇచ్చారు.
టికెట్ కోసం పలువురు నేతలు ప్రయత్నించినప్పటికీ... చివరకు వీరిద్దరికీ అదృష్టం దక్కింది. టీడీపీ ఏపీ అధ్యక్షడు కళా వెంకట్రావు, ఆర్థికమంత్రి యనమలతో భేటీ అయిన అనంతరం... చంద్రబాబు తుది నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. చివరి నిమిషంలో సమీకరణాలు మారితే తప్ప... వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారైనట్టేనని చెబుతున్నారు.