Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాంగ్రెస్ మహా నేతలకూ టీడీపీ సభ్యత్వమే... జగన్‌ ఏం పాపం చేశారు.. తనకూ ఇచ్చేస్తే పోలా!

పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి నారాలోకేస్ నేతృత్వంలో జరిగిన అవకతవకలు ఇన్నీ అన్నీ కాదని స్పష్టమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, సీనియర్ నేతగా ఉన్న సి.రామచంద్రయ్యకే టీడీపీ సభ్యత్వం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా పలువురు జర్నలిస్టులూ,

Advertiesment
కాంగ్రెస్ మహా నేతలకూ టీడీపీ సభ్యత్వమే... జగన్‌ ఏం పాపం చేశారు.. తనకూ ఇచ్చేస్తే పోలా!
హైదరాబాద్ , ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (02:40 IST)
పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి నారాలోకేశ్ నేతృత్వంలో జరిగిన అవకతవకలు ఇన్నీ అన్నీ కాదని స్పష్టమైంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా, సీనియర్ నేతగా ఉన్న సి.రామచంద్రయ్యకే టీడీపీ సభ్యత్వం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇంకా పలువురు జర్నలిస్టులూ, సామాన్యులకూ సభ్యత్వాలు జారీ చేశారు. ఓటర్ల జాబితా ఆధారంగా విచ్చలవిడిగా సభ్యత్వ నమోదు పత్రాలను పూరించటంతో ఇంత గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది.
 
ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే కడప నగరంలో సి. రామచంద్రయ్య వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ ఉషారాణి భర్త సూర్యనారాయణ రావు, ఆయన సోదరుడు అశ్వర్థ నారాయణకూ టీడీపీ సభ్యత్వాలు వచ్చాయి. పైగా  పింఛనుదార్లనుంచి బలవంతంగా రూ.100 వసూలు చేసి సభ్యత్వం కట్టబెట్టిన వ్యవహారం పత్రికల్లో వచ్చింది. ఓటరు లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికీ సభ్యత్వం జారీచేసి టీడీపీకి కోటిమంది సభ్యులున్నారంటూ గొప్పలు చెప్పుకున్నారు. 
 
ఆ డొల్ల సభ్యత్వాలు చేర్పించడాన్నే అర్హతగా చూపి సీఎం తనయుడు నారా లోకేశ్‌కు ఎమ్మెల్సీ, మంత్రి పదవులు అప్పగించడం టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహంలో భాగమేనని పరిశీలకులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ఈ ఉదంతంపై ఎకసెక్కా లాడుతోంది సి.రామచంద్రయ్యకు టీడీపీ సభ్యత్వం ఇచ్చినోళ్లు వైకాపా అధినేత జగన్‌కు ఎందుకివ్వలేదు. ఆయనేం పాపం చేశారు. ఒక సభ్యత్వం ఇచ్చేస్తే పోలా.. అంటూ జోకులుమీద జోకులేస్తున్నారు. 
 
లోకేశ్  ఆ పనిచేయగలిగితే ఏపీ సీఎం పోస్టు కూడా తండ్రి చంద్రబాబు తనకే ఇవ్వవచ్చు కదా అని నెటిజన్లు మేలమాడుతున్నారు. నిజమే కదా లోకేశ్ బాబూ.. జగన్ ఎన్నాళ్లని వైకాపాలో ఉండి ఒంటరి పోరాటం చేస్తూ అక్కడే ఉండిపోతారు. దయతల్చి తనకూ ఒక టీడీపీ సభ్యత్వం ఇచ్చేస్తే  పోలా.. అలా పడి ఉంటారు కదా మరి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు బీభత్స కసరత్తు.. చివరి క్షణం వరకు ఊపిరాగిన మంత్రులు