వైజాగ్ ఉక్క కర్మాగారం ప్రైవేటీకరణ ఒప్పందంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తముందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీహెచ్. అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అంతేకాకుండా, ఈ కర్మాగారారం ప్రైవేటీకరణ ఒప్పంద కంపెనీ పోస్కోకు ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య మధ్యవర్తి పలు అవినీతి కేసుల్లో ఏ2 నిందితుడుగా ఉన్న వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అని ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, పోస్కో కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్‌తో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. పోస్కో కంపెనీ సీఎండీకి జగన్ సన్మానం చేయలేదా? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి ఎన్నిసార్లు వెళ్లారో సాక్ష్యాధారాలతో సహా చూపిస్తామని అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గనులు లేవంటున్నారని.. పోస్కోకు గనులు ఇక్కడ ఉన్నాయా? అని ప్రశ్నించారు. పోస్కోకు సీఎం జగన్‌కు మధ్యవర్తి విజయసాయిరెడ్డి కాదా? అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. వైజాగ్ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించిందనీ ఆరోపించిన ఆయన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇపుడు మాట మార్చుతోందని ఆరోపించారు.