మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి వర్థంతికి లేని షరతులు హిందువుల తొలి పండుగల్లో ఒకటైన వినాయకచవితికి విధించడమా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 10న వినాయకచవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.
వినాయకచవితి వేడుకలపై జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా తప్పుబట్టారు. వినాయకచవితి పూజలపై ఆంక్షలు ఎందుకు పెడతారని ప్రశ్నించారు. వైఎస్ వర్ధంతికి లేని నిబంధనలు వినాయకచవితి పండగకు మాత్రమే ఎందుకని నిలదీశారు.
హిందూవుల పండగలపై ప్రభుత్వం చిన్నచూపు తగదని హితవు పలికారు. తెలంగాణలో వినాయక చవితి వేడుకలకు అనుమతించినప్పుడు.. ఏపీలో ఎందుకు అనుమతించరు? అని ప్రశ్నించారు.
దిశ చట్టం ఎక్కడుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బాధిత మహిళలకు న్యాయం జరగాల్సి ఉందని, ఈ నెల 9న నరసరావుపేటలో నిరసన కార్యక్రమం చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.