Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుజనా చౌదరి పవన్ కళ్యాణ్‌కు పాఠాలు... ప్యాకేజీ అంతా చూపిస్తే పవన్ ప్రత్యేక హోదా వద్దంటారు...

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదా కంటే చాలా చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు అంటున్నారు. ఇదే విషయంపైన కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి జనసేన అధ్యక్ష

Advertiesment
సుజనా చౌదరి పవన్ కళ్యాణ్‌కు పాఠాలు... ప్యాకేజీ అంతా చూపిస్తే పవన్ ప్రత్యేక హోదా వద్దంటారు...
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (17:07 IST)
మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదా కంటే చాలా చాలా గొప్పదని తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు అంటున్నారు. ఇదే విషయంపైన కేంద్రమంత్రి సుజనా చౌదరి మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలిసినట్లు లేదనీ, ఆయనకు పూర్తిగా తెలిస్తే అసలు ఆయన ప్రత్యేక హోదా వద్దని అంటారనీ, ప్యాకేజీ చాలా బావుందని చెపుతారని అంటున్నారు. 
 
అందుకే తాము పవన్ కళ్యాణ్‌ను ఈ విషయమై నేరుగా కలిసి ప్యాకేజీలో ఏమేమి ఉన్నాయో, ప్రత్యేక హోదాలో ఏమేమి ఇస్తారో వివరించి చెపుతామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తమ మిత్రపక్ష పార్టీ అనీ, అందువల్ల ఆయనకు ప్యాకేజీ గురించి వివరించాల్సిన బాధ్యత తమపై ఉన్నదన్నారు. 
 
ప్యాకేజీలో ప్రత్యేక హోదా అన్న మాట మాత్రమే లేదు కానీ అంతకుమించిన నిధులు ప్యాకేజీగా ఏపీకి వస్తున్నాయని పేర్కొన్నారు. దీని గురించి పవన్ కళ్యాణ్ కు విడమర్చి చెప్పేందుకు తనే రంగంలోకి దిగుతానని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదాతో అద్భుతాలు జరిగిపోతాయని ప్రతిపక్ష పార్టీలు చెప్పడం విడ్డూరమనీ, ప్యాకేజీ ముందు ప్రత్యేక హోదా దిగదుడుపు అని వ్యాఖ్యానించారు సుజనా చౌదరి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సినిమా వాళ్ల ఇరుగు పొరుగునే టెర్రరిస్ట్... పట్టుకోలేదు.. చివరి ఎలా దొరికాడు..?