Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆరడుగుల ఆజానుబాహుడు అచ్చెన్న, కన్పించకపోవడం ఏంటి? సీఎం జగన్ సెటైర్లు

Advertiesment
ఆరడుగుల ఆజానుబాహుడు అచ్చెన్న, కన్పించకపోవడం ఏంటి? సీఎం జగన్ సెటైర్లు
, సోమవారం, 30 నవంబరు 2020 (15:13 IST)
రేపటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ బీఏసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెదేపా నాయకుడు అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి సెటైర్లు వేశారు.
 
అచ్చెన్నాయుడు బీఏసి సమావేశం ఆలస్యంపై ప్రశ్నించగా... గౌరవ అచ్చెన్నాయుడు ధర్నా చేస్తున్నందుకే ఆలస్యంగా ప్రారంభించామన్నారు. అంతేకాదు... అచ్చెన్నాయుడు ది గ్రేట్ అంటూ చెప్పారు.
 
ఆ తర్వాత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... తమను టీవీల్లో చూపించడం లేదని చెప్పగా, ఆరడుగుల ఆజానాబాహుడు కనిపించకపోవడం ఏంటని సెటైర్ వేసారు జగన్. మరోవైపు అసెంబ్లీ వద్దకు తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ధర్నా నిర్వహించారు. నివర్ తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంటలకు సంబంధించి ధర్నా చేసిన నేతలు, వరి కంకులను చూపిస్తూ ధర్నా నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖైదీలకు ఓ గుడ్ న్యూస్... అదేంటంటే.. ఏటీఎం వచ్చేస్తుందట..?