పెన్నా నదిలో సరదాగా ఈతకు వెళ్లిన ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం అనే ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుపతిలోకి కోరగుంటకు చెందిన కొందరు యువకులు కడప జిల్లాకు విహార యాత్రకు వెళ్లారు.
ఆ తర్వాత సిద్ధవటంలో పెన్నానదిలో ఈతకు వెళ్లారు. ఈ ఏడుగురు గల్లంతయ్యారు. ఈత కొడదామని నదిలో దిగి, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోయారని వివరించారు.
ఈ విషయాన్ని కొందరు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు పిలిపించి నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వారు తిరుపతిలోకి కోరగుంటకు చెందిన వారని గుర్తించారు. ఇప్పటివరకు ఆరుగురు యువకుల మృతదేహాలను బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పెన్నానదిలో గల్లైంతనవారిని తిరుపతి సమీపంలోని కోరగుంట నుంచి సోమశేఖర్, యశ్, జగదీశ్, సతీష్, చెన్ను, రాజేష్, తరుణ్ అనే యవకులుగా గుర్తించారు.