Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపట్ల వద్ద సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుముప్పు...

sangamitra exp
, గురువారం, 22 జూన్ 2023 (20:09 IST)
ఏపీలోని బాపట్ల జిల్లా వద్ద దానాపూర్ - బెంగూళురు ప్రాంతాల మధ్య నడిచే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ముప్పు తప్పింది. చీరాల మండలం ఈపురుపాలెం వంతెన వద్ద రైలు పట్టా విరిగింది. దీన్ని ఓ చేనేత కార్మికుడు గుర్తించి రైల్వే అధికారులకు చేరవేయడంతో ఈ ముప్పు తప్పింది. లేనిపక్షంలో పెను ప్రమాదం జరిగివుండేది. దీంతో అదే ట్రాక్‌పై రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదాన్ని గద్దె బాబు అనే చేనేత కార్మికుడు ముందుగా గుర్తించి సకాలంలో రైల్వే స్టేషన్ సిబ్బందికి చేరవేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయం తెలుసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విరిగిన పట్టాను సరిచేసిన తర్వాత సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ రైలు బెంగుళూరుకు బయలుదేరి వెళ్లింది. ఈ పట్టాకు మరమ్మతులు చేసేంత వరకు ఐదు రైళ్లను నిలిపివేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు మత్తుమందిచ్చి.. పరాయి పురుషుల కోర్కెలు తీర్చిన భర్త... ఎక్కడ?