Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో కరోనావైరస్ పరీక్షకు శాంపిల్స్ ఇచ్చినా రాని ఫలితాలు

ఏపీలో కరోనావైరస్ పరీక్షకు శాంపిల్స్ ఇచ్చినా రాని ఫలితాలు
, మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (21:51 IST)
ఒకపక్క వేలల్లో కేసులు. ఇంకోపక్క తమకు దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు వుండటంతో కరోనావైరస్ లక్షణాలేమోనని ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం. వీరు ఇచ్చిన ఫలితాలు కొన్నిచోట్ల ఎంతకీ రావడంలేదు. దాంతో ఆందోళనతో కొంతమంది ప్రైవేటు ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు.
 
కరోనాకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు కరోనా వైరస్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి పట్ల వైద్య అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.
 
ర్యాపిడ్ టెస్టుల్లో 30 నిమిషాల్లో ఫలితం రావాలని, ఆర్టీపీసీఆర్ ట్రూనాట్ టెస్టులో 24 గంటల్లో ఫలితాలు రావాలని చెప్పారు. వారం రోజుల్లో రెగ్యులర్ సిబ్బంది భర్తీ ప్రక్రియను పూర్తిచేయాలని, అదనపు సిబ్బంధి నియామకాలు కూడా కొన్నిచోట్ల ఇంకా పూర్తికాలేదని ఆ ప్రక్రియను కూడా పూర్తిచేయాలని ఆదేశించారు.
 
ఆసుపత్రిలో చేరేందుకు ఎవరైనా ఫోన్ చేస్తే అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని అన్నారు. కాల్ సెంటర్ వ్యవస్థను ఎప్పటికప్పడు చెక్ చేసుకోవాలని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 423మంది మృతి