Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా భార్య రోజా నీలి చిత్రాలు బహిర్గతం చేయాలి : రోజా భర్త ఆర్కే.సెల్వమణి డిమాండ్

Advertiesment
Selvamani-Roja
, బుధవారం, 4 అక్టోబరు 2023 (09:30 IST)
తన భార్య, ఏపీ మంత్రి ఆర్కే రోజాకు చెందిన నీలి చిత్రాలు (బ్లూ ఫిల్మ్స్) ఉంటే బహిర్గతం చేయాలని ఆమె భర్త, సినీ దర్శకుడు ఆర్కే. సెల్వమణి డిమాండ్ చేసారు. తన భార్య రోజాపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి చేసిన ఆరోపణలపై ఆయన స్పందించారు. 
 
తన భార్య రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఇలా అనుచితంగా మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలాగే మాట్లాడారని గుర్తు చేశారు. తన భార్య బలంగా పోరాడుతున్నారని, అందుకే ఆమెను మానసికంగా దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నారు. 
 
ఎమోషనల్ బ్లాక్ మెయిల్ టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వీళ్లు ఎన్ని రోజులు ఇలా బ్లాక్ మెయిల్ చేస్తారు? అని ప్రశ్నించారు. తాను బండారు సత్యనారాయణకు సవాల్ చేస్తున్నానని, మీ వద్ద ఏమైనా వీడియోలు ఉంటే ఖచ్చితంగా బయట పెట్టవచ్చునన్నారు. మా కోసం ఆగాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి బెదిరింపులు, నీచమైన పనులు తమకు వద్దన్నారు. అసలు టీడీపీ పార్టీకే ఇలాంటి అన్నారు. ఇంతకుముందు కూడా కొంతమంది ఇలాగే మాట్లాడారన్నారు. 
 
రోజా మంచి ఫైటర్ కాబట్టి, ఆమెను దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బండారు వద్ద ఏవైనా ఉంటే ధైర్యంగా బయటపెట్టాలని, అలాంటి వాటిని తాము ఫేస్ చేస్తామన్నారు. మగాడు అంటే చెప్పినమాట మీద ఉండేవాడని ఆర్కే సెల్వమణి అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందే భారత్ స్లీపర్ క్లాస్ బోగీలు ఎలా ఉన్నాయో చూశారా?