Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

5 కోట్ల మంది ఆంధ్రులు మిమ్మల్ని అడుక్కోవాలా...?: రేణుకా చౌదరి ఫైర్

ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో భాజపా ఏకాకిగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ... దేశ ప్రధాని కేబినెట్ ముద్ర వేసిన దాన్ని అమలు చేయరా...? ఎందుకీ చర్చలు? చేసిందే మళ్లీ చేస

Advertiesment
Renuka Chowdary Speech
, గురువారం, 28 జులై 2016 (20:58 IST)
ఏపీ ప్రత్యేక హోదాపై రాజ్యసభలో భాజపా ఏకాకిగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మద్దతు తెలుపుతున్నారు. సభలో రేణుకా చౌదరి మాట్లాడుతూ... దేశ ప్రధాని కేబినెట్ ముద్ర వేసిన దాన్ని అమలు చేయరా...? ఎందుకీ చర్చలు? చేసిందే మళ్లీ చేస్తారా? గత చరిత్రను మళ్లీ తిరగ తోడుతూ ఉంటారా? 5 కోట్ల మంది ఆంధ్రులు మిమ్మల్ని అడుక్కోవాలా...?
 
ఏపీ ప్రత్యేక హోదా ఆంధ్రా హక్కు. చర్చలు జరిగి అందరూ విభజనకు అంగీకరించి రాష్ట్రాన్ని విభజించారు. ఇప్పుడెందుకు హామీలు నెరవేర్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. రాజకీయ ద్వేషమా, ప్రాంతీయ ద్వేషమా? తెలుగువాళ్లంటే ఏముందిలే అనుకుంటున్నారా? 5 కోట్ల ఆంధ్రులను తక్కువ అంచనా వేయవద్దు? మీరిప్పుడు వాళ్ల మంచితనాన్ని చూస్తున్నారు.
 
ప్రత్యేక హోదా అనేది గేటుపైన అలంకరణ కోసమా? ఎందుకు కాదని వంకలు పెడుతున్నారు. 14వ ఆర్థిక సంఘం అంటారు. ఎందుకు ఈ మెలికలు. ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలి. ఆంధ్రుల హక్కు కోసం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పోరాడుతారు అని ముగించారు రేణుక.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ప్రత్యేక హోదా అనేది ఓ అంటువ్యాధిలా పాకింది... సీఎం రమేష్