Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతి భవనాల డిజైనింగ్‌లో రాజమౌళి పాత్ర?

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న భవనాలు ప్రపంచంలోని ప్రఖ్యాత కట్టడాలను తలదన్నే రీతిలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం భవనాల డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపి

Advertiesment
అమరావతి భవనాల డిజైనింగ్‌లో రాజమౌళి పాత్ర?
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (11:35 IST)
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మించనున్న భవనాలు ప్రపంచంలోని ప్రఖ్యాత కట్టడాలను తలదన్నే రీతిలో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం భవనాల డిజైనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. అవసరమైతే ఈ డిజైనింగ్‌లో దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి సలహాలు స్వీకరించాలని భావిస్తోంది. 
 
గతంలో గోదావరి కృష్ణ పుష్కరాల ఏర్పాట్లు విషయంలో కూడ రాజమౌళి సలహాలను తీసుకోవాలని తెలుగుదేశ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే, 'బాహుబలి' హడావిడి మధ్య తాను సలహాలు ఇవ్వలేను అంటూ రాజమౌళి సున్నితంగా తిరస్కరించారు. కానీ, ఈసారి దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా రూపొందబోతున్న అమరావతి పట్టణ బిల్డింగ్ డిజైన్స్‌కు రాజమౌళి సలహాలను తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో కొంతమంది ఈ న్యూస్‌పై కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేస్తున్నారు.
 
రాజమౌళి మంచి దర్శకుడే కాని అద్భుతమైన డ్రాయింగ్స్ వేయగల మంచి ఆర్కెటిక్ కాడు. 'బాహుబలి' సెట్‌కు సంబంధించి రాజమౌళి ఆలోచనలు చెపుతూ ఉంటే వందలాది మంది ఆర్టిస్టులు రాజమౌళి ఆలోచనలకు జీవం పోసేడట్లుగా డ్రాయింగ్‌లు వేశారు. ఆ డ్రాయింగ్స్‌కు గ్రాఫిక్ డిజైనర్స్ జత కూడిన తర్వాత అంత అద్భుతమైన సినిమాగా 'బాహుబలి' మారింది. దీంతో ఒక దర్శకుడుని తీసుకు వచ్చి అమరావతి డిజైన్స్ రూపకల్పనలో భాగం చేస్తే అమరావతి పూర్తి అయిపోతుందా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. 
 
అయితే రాజమౌళి ఆర్కెటిక్ కాకపోయినా ఊహలలో ఆర్కెటిక్‌కు మించిన స్థాయిలో ఊహించగలిగిన భావకుడు. ఆ ఆలోచనలను వినియోగించుకోవాలనే కాబోలు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి డిజైన్స్‌లో రాజమౌళి సలహాలను అడుగబోతోంది అనుకోవాలి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే అమరావతి చరిత్రలో రాజమౌళికి కూడా శాశ్విత స్థానం దక్కే అవకాశాలే కనిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చక్రం తిప్పుతున్న శశికళ భర్త... పోయస్ గార్డెన్‌లో మంత్రులకు లాగులు తడిసిపోతున్నాయ్...!?