Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రాల‌య‌ మఠంలో మానసిక రోగి హల్చల్!

మంత్రాల‌య‌ మఠంలో మానసిక రోగి హల్చల్!
, శనివారం, 24 జులై 2021 (11:46 IST)
గురు రాఘ‌వేంద్ర స్వామి మంత్రాలయం మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు. అంద‌రు భ‌క్తుల్లాగానే తాను మంత్రాలయానికి చేరుకున్నఆ మాన‌సిక రోగి త‌న తలనీలాలు సమర్పించాడు. అనంత‌రం కేవ‌లం నిక్కరుతో ఆలయంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు.

దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఆ మాన‌సిక రోగి అసభ్యక రంగా ప్రవర్తించాడు. సెక్యూరిటీ సిబ్బంది అత‌డిని అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా, దాడికి యత్నించాడు. దీంతో అత‌ని వ‌ద్ద కర్రను బ‌ల‌వంతంగా తీసుకుని ఆ మాన‌సిక రోగిని అక్క‌డి నుంచి పంపేశారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ, నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించాడ‌ని అక్క‌డి చిరు వ్యాపారులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివేకా హ‌త్య‌కు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చిందెవ‌రు?