అధ్యాపక వృత్తికి కళంకం తెచ్చాడో ప్రబుద్ధుడు. ఫేస్‌బుక్ పరిచయాల ద్వారా అమ్మాయిలను వేధించాడు. ఎట్టకేలకు అశ్లీల ఫోటోలు, కామెంట్లతో వేధిస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ ఇచ్చే ప్రొఫెసర్ కారాని నరేష్ ఫేస్ బుక్ ఖాతా ప్రారంభించాడు.
కాకినాడలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేసే కారాని.. నకిలీ ఫేస్ బుక్ ద్వారా అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పెట్టి పరిచయం చేసుకుని, ఆపై అసభ్య మెసేజ్‌లు, చిత్రాలు పంపుతూ వేధించేవాడు. పెనుగొండకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నరేష్‌ను అరెస్ట్ చేశారు.