Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాకు ఆ టెస్టు చేయించండి, జగన్ గురించి నేను చెప్పేదంతా నిజమేనంటున్న పోసాని

నాకు ఆ టెస్టు చేయించండి, జగన్ గురించి నేను చెప్పేదంతా నిజమేనంటున్న పోసాని
, శనివారం, 27 జూన్ 2020 (18:03 IST)
పోసాని క్రిష్ణమురళి. ఈయన గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. తెలుగుదేశం పార్టీని తిట్టడం.. వైసిపిని భుజానికి ఎత్తుకోవడం చేస్తున్నారు పోసాని క్రిష్ణమురళి. ఎందుకంటే ఆయన వైసిపిలో ఉన్నారు కాబట్టి. ఇదేంటిది వైసిపిలో ఉంటే ప్రతిపక్షాన్ని తిట్టడం మామూలే కదా.. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..?
 
అయితే ఎన్నికలకు ముందు హడావిడిగా కనిపించిన పోసాని క్రిష్ణమురళి వైసిపికి బాగానే ప్రచారం చేశారు. అధికారంలోకి వైసిపి వచ్చిన తరువాత కొన్నినెలల పాటు కనిపించలేదు. అందుకు కారణం వైసిపి కార్యకర్తలతో విభేదాలన్న ప్రచారం బాగానే సాగింది. దీనిపై ఏ మాత్రం స్పందించని పోసాని మళ్ళీ కొన్నిరోజుల క్రితం మీడియా సమావేశాన్ని పెట్టారు. ఎపిలో జగన్‌ను, తెలంగాణాలో కెసిఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.
 
మళ్ళీ యాక్టివ్ రోల్‌ను పోషించడం మొదలెట్టారు. తాజాగా పోసాని క్రిష్ణమురళి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. నాకు నార్కో అనాలసిస్ చేయించండి. నేను చెప్పేదంతా నిజమే. జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఎవరూ చేయలేదు.
 
ఒక్క అవకాశమని నేను అడిగాను. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని ప్రతిసారి జనమే ఇస్తారు. అలా ఓట్లేస్తారు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగనే సీఎం అంటున్నారు పోసాని క్రిష్ణమురళి. తన మనస్సు నిండా వైఎస్ జగన్మోహన్ రెడ్డే ఉన్నారని.. అద్భుతమైన పరిపాలన అందించడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందంటున్నారు పోసాని. నామినేటెడ్ పదవుల కోసమే జగన్మోహన్ రెడ్డిని పోసాని పొగడ్తలతో ముంచెత్తుతున్నారన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు నుంచి వ్యక్తమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజుకు 16 గంటలు పబ్జీ ఆడేవాడు.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు..