పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. పిఠాపురం సీటు నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ విజయం వెనక ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా కృషి చేశారు. గతంలో ఈ టికెట్ త్యాగం చేసేందుకు వర్మను చంద్రబాబు ఒప్పించారు.
కూటమి అధికారంలోకి వస్తే గౌరవమైన పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. కూటమి బంపర్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన వేళ వర్మకు పదవి ఖాయమనే చర్చ జోరుగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై దుండగులు దాడి చేశారు. గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కారు అద్ధాలు పగులగొట్టారు.
అయితే వర్మపై జనసైనికులే దాడి చేశారని వార్తలు వస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్తలు స్థానిక టీడీపీ నేత అయిన వర్మపై దాడికి యత్నించారు. ఈక్రమంలో ఆయన కారు ధ్వంసం అయింది.