Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'చంద్రబాబు తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నారే.. అప్పుడు చర్య తీసుకున్నారా?

అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని.. రభస సృష్టించి.. విధ్వంసానికి పాల్పడినందుకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్

'చంద్రబాబు తీరుతో కన్నీళ్లు పెట్టుకున్నారే.. అప్పుడు చర్య తీసుకున్నారా?
హైదరాబాద్ , ఆదివారం, 29 జనవరి 2017 (02:47 IST)
అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుని.. రభస సృష్టించి.. విధ్వంసానికి పాల్పడినందుకు వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలపై చర్యకు సిఫార్సు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సభా హక్కుల కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అసమ్మతి నోట్‌ను విడిగా ఇచ్చారు. ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం కొత్తేమీ కాదని, గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలకు బాధపడి ఉపసభాపతి కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. 
 
అసెంబ్లీ సవ్యంగా జరగాలంటే స్పీకర్‌, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని వైఎస్‌ఆర్‌ సీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సభను నడుపుకోలేక ప్రతిపక్షాల మీద అభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. శనివారం ఏపీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో చెప్పినట్లు వెల్లడించారు.
 
సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వారు ప్రివిలేజ్‌ కమిటీ ముందు వివరణ ఇచ్చారని పెద్దిరెడ్డి వెల్లడించారు. సమావేశంలో గతంలో టీడీపీ సభ్యులు ఎలా వ్యవహరించారో తెలియజేశామని, చంద్రబాబు తీరుతో గతంలో కుతూహలమ్మ, ఆలపాటి ధర్మారావు కన్నీళ్లు పెట్టుకున్నారని, కొంతమంది టీడీపీ సభ్యులైతే గవర్నర్‌పై దాడికి పాల్పడ్డారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో పట్టుబట్టినందుకు ప్రవిలేజ్‌ కమిటీ 12 మందికి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
 
టాగ్లు: peddireddy ramachandra reddy, privilege committee, chandrababu, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబు, వైఎస్‌ఆర్ సీపీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వహ్వా బీజేపీ మేనిఫెస్టో... యూపీ యువత గాల్లో తేలినట్టుందే... ఏపీ హోదా గాలికి...