Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునీతమ్మ కలిసి పనిచేద్దాం :: భేటీ పేరుతో పరిటాల ఫ్యామిలీకి పవన్ గాలం?

అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి మంత్రి పరిటాల సునీతకు ఇంటికి వెళ్ళారు. గంటన్నరుకుపైగా వారి ఇంట్లోనే పవన్ కళ్యాణ్‌ గడిపారు.

సునీతమ్మ కలిసి పనిచేద్దాం :: భేటీ పేరుతో పరిటాల ఫ్యామిలీకి పవన్ గాలం?
, సోమవారం, 29 జనవరి 2018 (15:03 IST)
అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి మంత్రి పరిటాల సునీతకు ఇంటికి వెళ్ళారు. గంటన్నరుకుపైగా వారి ఇంట్లోనే పవన్ కళ్యాణ్‌ గడిపారు. అనంతపురం జిల్లాలో నిర్మితమవుతున్న సాగు, తాగునీటి ప్రాజెక్టులు, జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై మంత్రితో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత ఒక్కరే కాదు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్‌తో కూడా చర్చించారు పవన్ కళ్యాణ్‌. అయితే మీడియాతో మాత్రం పవన్ కళ్యాణ్ కేవలం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు స్థానిక మంత్రి ఇంటికి వచ్చానని, తాను రాజకీయాల్లోకి రాకముందే పరిటాల కుటుంబ సభ్యులతో పరిచయం ఉందని చెప్పారు పవన్ కళ్యాణ్‌.
 
అయితే దీనికంతటికి ముందే పవన్ - పరిటాల కుటుంబ సభ్యుల మధ్య ఆశక్తికరమైన చర్చ జరిగింది. వీరి ముగ్గురి మధ్యే జరిగిన చర్చ రాజకీయాల్లోకి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే జనసేనలోకి పరిటాల కుటుంబాన్ని పవన్ ఆహ్వానించడమే. పరిటాల కుటుంబంతో రాజకీయంగా కూడా కుటుంబ సభ్యుడిగా గతంలోనే మంచి పరిచయం ఉంది పవన్ కళ్యాణ్‌. ఆ పరిచయంతోనే వారి ఇంటికి వెళ్ళారు. కొత్తగా పార్టీ పెట్టడమే కాకుండా నిజాయితీ, నిష్పక్షపాతంగా పనిచేసే నేతలను తీసుకోవాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్‌ ఉన్నారు. 
 
అనంతపురంలో ఉన్న నేతల్లో పరిటాల కుటుంబంకు మంచి పేరే ఉంది. ఎక్కడా ఆరోపణలు లేకుండా పనిచేస్తున్న మంచి పేరు ఆ కుటుంబంకు ఉంది. అందుకే అలాంటి వ్యక్తుల్ని జనసేనలోకి తీసుకోవాలన్నది పవన్ ఆలోచన. ఇదే విషయాన్ని పరిటాల సునీత, శ్రీరామ్ లకు తెలిపారు పవన్. కానీ తమకు కొద్దిగా సమయం కావాలని, ముందస్తు ఎన్నికల సమయం ఇంకా ఉంది కాబట్టి ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలని పరిటాల సునీత, శ్రీరామ్ కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ పరిటాల కుటుంబం జనసేనలోకి వెళితే మాత్రం అనంతపురంజిల్లాలో తెలుగుదేశంపార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లే.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరు అరిస్తే... కేకలు వేస్తే నాకే అవమానం : పవన్ కళ్యాణ్