Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం : కేటీఆర్

Advertiesment
paleru by poll
, శనివారం, 7 మే 2016 (15:21 IST)
గోదావరి జిలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. పాలేరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ... ఎవ్వరు అడ్డుపడినా, ఎవరేమన్నా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామన్నారు. 
 
దశాబ్దాలుగా కాంగ్రెస్‌ చేయని పనిని తెరాస ప్రభుత్వం చేస్తుందన్నారు. జిల్లాలో 5 నుంచి 6 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తుందన్నారు. సీతారామ ప్రాజెక్టును పాలేరు జలాశయానికి అనుసంధానించి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయకట్టను స్థిరీకరిస్తామన్నారు. రాష్ట్ర సాధన కోసం ఏ నిబద్ధతతో పనిచేశామో అదే వైఖరితో రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా గురించి చట్టంలో లేదు.. అందువల్ల, ఇవ్వలేం : జయంత్ సిన్హా