Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నియోజకవర్గ అభివృద్థి కోసం తెదేపాలో చేరుతున్నా : అమర్నాథ్ రెడ్డి

Advertiesment
Palamaner
, గురువారం, 16 జూన్ 2016 (13:31 IST)
తన సొంత నియోజకవర్గ అభివృద్థి కోసమే వైఎస్ఆర్ సీపీ నుంచి తెదేపాలోకి చేరుతున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి తెలిపారు. పార్టీలో కొంతమంది నాయకుల వ్యవహారశైలి నచ్చకపోవడం కూడా ఒక కారణమన్నారు. 
 
ఆయన బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడకు వెళ్ళి చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నట్టు చెప్పారు. వైసిపిలో కొంతమంది నాయకులు తనను హీనంగా చూశారని, అధినేతను కలవాలన్నా కలవనివ్వకుండా చేశారని వాపోయారు.
 
పలమనేరులో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, అభివృద్థి కోసమే తాను పార్టీని వీడుతున్నట్లు చెప్పారు. తనతో పాటు చిత్తూరుజిల్లాకు చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరేందుకు సిద్థంగా ఉన్నారని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్‌కు టోకరా... ఐఫోన్ల స్థానంలో చైనా ఫోన్లు పెట్టి మోసం చేసిన ఇంటి దొంగలు ఎలా?