Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరుతను చంపేసిన వృద్ధుడు... ఎక్కడో తెలుసా...?

సాధారణంగా చిరుత పులులను చూస్తే భయపడి ఆమడదూరం పారిపోతుంటాం. చిరుత అరుపులకే మనకు వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటి చిరుత నేరుగా కనిపిస్తే ఇక చెప్పాలా? కానీ ఒక వృద్ధుడు మాత్రం ఏ మాత్రం భయపడలేదు.

Advertiesment
చిరుతను చంపేసిన వృద్ధుడు... ఎక్కడో తెలుసా...?
, సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:20 IST)
సాధారణంగా చిరుత పులులను చూస్తే భయపడి ఆమడదూరం పారిపోతుంటాం. చిరుత అరుపులకే మనకు వణుకు వచ్చేస్తుంటుంది. అలాంటి చిరుత నేరుగా కనిపిస్తే ఇక చెప్పాలా? కానీ ఒక వృద్ధుడు మాత్రం ఏ మాత్రం భయపడలేదు. తన ఆవుపై చిరుత దాడి చేస్తోందని తెలుసుకుని వెంటనే చిరుతపై ఒక్క ఉదుటున దూకాడు. అంతటితో ఆగలేదు. తన వద్దనున్న కత్తితో చిరుతను పొడిచాడు. ఇలా చిరుత చచ్చేంత వరకు దాంతో పోరాడాడు. తనకు గాయాలవుతున్నా పట్టించుకోలేదు ఆ వృద్ధుడు. ఈ సంఘటన ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని మహారాజకడై గ్రామంలో జరిగింది. 
 
కృష్ణమూర్తి అనే రైతు ఆవులను మేపుకుంటూ వెళుతున్నాడు. అటవీ ప్రాంతం నుంచి ఉన్నట్లుండి ఒక చిరుత ఆవుపై దాడికి ప్రయత్నించింది. రక్షణ కోసం తనతో పాటు తెచ్చుకున్న కత్తితో చిరుతపై దాడి చేశాడు వృద్ధుడు కృష్ణమూర్తి. ఐదు నిమిషాలకుపైగా కృష్ణమూర్తి, చిరుతల మధ్య పెనుగలాటలు జరిగాయి. తనకు రక్తస్రావమవుతున్నా భయపడకుండా చిరుతను కత్తితో పొడిచి చంపేశాడు కృష్ణమూర్తి. దీంతో గ్రామస్తులు భారీగా అక్కడకు చేరుకున్న కృష్ణమూర్తి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కృష్ణమూర్తి సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భర్తలతో పనిలేదు.. మీ లైఫ్.. మీ ఇష్టం : మహిళలకు సౌదీ సర్కారు గిఫ్ట్